header

Ragi Malt with fruits…ఫ్రూట్స్ తో రాగిజావ..

Ragi Malt with fruits…ఫ్రూట్స్ తో రాగిజావ..
కావలసిన పదార్ధాలు
రాగిపిండి : పావు కప్పు
జీడిపప్పు : 5
బాదం పప్పులు : 10
వాల్ నట్ : 4
ఎండుద్రాక్ష : 10
యాపిల్ ముక్కలు : పావు కప్పు
దానిమ్మ గింజలు : పావు కప్పు
నీళ్లు : ఒకటింపావు కప్పులు
తయారు చేసే విదానం :
ముందుగా జీడిపప్పు, బాదంపప్పు, వాల్నట్స్ వేయించి పొడి చేసుకోవాలి. రాగిపిండిని పావుకప్పు చల్లని నీళ్లలో ఉండలు లేకుండా కలిపి ఉంచాలి. మిగతా నీళ్లను ఒక గిన్నెలో పోసి పొయ్యిమీద పెట్టి మరుగుతున్నపుడు తడిపిన రాగిపిండిని పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తరువాత నట్స్ పొడిని కలుపు కోవాలి. తరువాత పాలను కూడా కలిపి మరొక 10 నిమిషాలు కాగనివ్వాలి. తరువాత దించుకొని కప్పులలో పోసి పైన యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు, ఏండుద్రాక్ష కలిపి తినవచ్చు
డా.లహరి సూరపనేని, న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్