కావలసిన పదార్థాలు
కావలసినవి
కొర్రబియ్యం : పావుకిలో
రాగిపిండి : 400 గ్రాములు
పెరుగు : కప్పు
ఉల్లిపాయ ముక్కలు : 1 కప్పు
కొతిమీర : 1 చిన్న కట్ట
పచ్చిమిర్చి : నిలువుగా చీల్చినవి 4
ఉప్పు : సరిపడినంత
తయారు చేయువిధానం :
మరుగుతున్న నీటిలో కొర్రబియ్యం వేసి ఉడికించాలి. చిన్న గిన్నె లో నీళ్ళు పోసి
అందులో రాగిపిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న కొర్రబియ్యంలో వేసి కలపాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఉడికిన తరువాత దింపాలి. చల్లారిన తరువాత పెరుగు,
ఉల్లిపాయ ముక్కలు వేసి కొతిమీర చల్లి వడ్డించాలి.