header

Mutton Fry

మటన్ ఫ్రై

కావలసినవి
మటన్ : అరకిలో
పెరుగు : 1 కప్పు
ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి
గరం మషాలా : 1 స్పూను
మిరియాలు : అరస్పూను
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు
కరివేపాకు : 2 రెమ్మలు
నూనె : 1 కప్పు
ఉప్పు : రుచికి సరిపడా వేయాలి
పసుపు : అర స్పూను
కారం : 2 స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా సన్నగా తరుగుకోవాలి
తయారు చేయు విధానం అల్లం, వెల్లుల్లి, మిరియాలు, అన్నీ కలిపి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని మటన్ ముక్కలు, టేబుల్ స్పూన్ నూనె, పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి రెండుగంటలు నాననివ్వాలి.
స్టౌ వెలిగించి బాణాలి లేక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు రుబ్బినవి వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తరువాత అందులో నానబెట్టిన మటన్ కూడా వేసి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, గరం మషాలా వేసి బాగా వేగనిచ్చి దింపుకోవాలి.