header

Mutton Biriyani

కాశ్మీరీ మటన్ పలావ్

కావలిసినవి
మటన్ : అరకిలో
బాస్మతి బియ్యం : 1 కిలో (అరగంటసేపు నానబెట్టుకోవాలి)
పెరుగు : 2 స్పూన్లు
శొంఠి పొడి : టీ స్పూన్
యాలకుల పొడి : పావు స్పూను
కుంకుమపువ్వు : 2 గ్రాములు
కారం : 2 స్పూన్లు
గరం మషాలా : రెండు స్పూన్లు
ఉప్పు : రుచికి సరిపడా వేసుకోవాలి
తయారు చేయువిధానం
ఒక వెడల్పాటి పాన్ లో నెయ్యువేసి వేడెక్కిన తరువాత మటన్ ముక్కలు, ఇంగువ వేసి రెండునిమిషాల పాటు వేయించాలి. తరువాత పెరుగు కలిపి మరలా కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పలావు ఆకు ఒకటి వేసి వేయించాలి. ఉడకటానికి కొద్దిగా నీరు కలపవచ్చు. గరమ్ మషాలా కూడా వేసి మటన్ కొద్దిగా మెత్తబడేదాకా ఉంచి యాలకుల పొడి,శొంఠిపొడి, కుంకుమపువ్వు, కారం, తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి కొద్దిసేపు ఉంచాలి. ఇలా తయారైన మటన్ ను వేరుగా ఒకగిన్నెలోకి తీసికోవాలి, అదే పాన్లో రెండు లీటర్ల నీరుపోసి కొద్దిగా సోంప్ పొడి స్పూన్ గరం మషాలపొడి పలచని గుడ్డలో మూటకట్టి నీళ్లలో వేయాలి. తరువాత బాస్మతీ బియ్యం కూడా వేసి సిమ్ లో బియ్యం పూర్తిగా కాకుండా సగం దాకా ఉడకనివ్వాలి. ఇది కూడా వేరుగా తీసుకొని (నీరు ఎక్కువగా ఉంటే వంపేయాలి.) అదే పాన్లో అన్నము కొద్దిగా సమాంతరంగా పరచి దానిపైన మటన్ ముక్కలు కొద్దిగా సమాంతరంగా పరచి దానిపైన మరలా అన్నం, అన్నంపైన మటన్ ముక్కలు ఇలా అంతా అయిపోయేదాకా వేయాలి. ఇపుడు సిమ్ లో పూర్తిగా అన్నం, మటన్ ఉడికేదాకా ఉంచి దించేటపుడు (అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవాలి) సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.