సాదా నూడుల్స్ ప్యాకెట్ – ఒకటి
ఉప్పు – అరచెంచా
నూనె - రెండు టేబుల్స్పూన్లు
ఉల్లిపాయ – ఒకటి
క్యాప్సికం – ఒకటి
వెల్లుల్లి – ఒకపాయ
సోయాసాస్ – చెంచా
రెడ్చిల్లీ సాస్ - టేబుల్స్పూను
వెనిగర్ - అరచెంచా లేదంటే నిమ్మరసం వేసుకోవచ్చు
టొమాటో కెచెప్ - టేబుల్స్పూను
ఎండుమిర్చి - మూడు (మరీ మెత్తగా కాకుండా పొడిలా చేసి పెట్టుకోవాలి), మిరియాలపొడి - అరచెంచా
గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు అరచెంచా నూనె, కొద్దిగా ఉప్పూ, నూడుల్స్ వేసి మంట తగ్గించాలి. కాసేపటికి అవి ఉడుకుతాయి. అప్పుడు దింపేసి వెంటనే చల్లటినీళ్లలో వేసి రెండు నిమిషాలయ్యాక వడకట్టుకోవాలి. వాటిపై ఇంకో చెంచా నూనె వేసి ఓసారి కలపాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లీ, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. నిమిషం తరవాత క్యాప్సికం తరుగూ, సోయాసాస్, రెడ్చిల్లీసాస్, వెనిగర్, టొమాటో కెచెప్, ఎండుమిర్చి పొడి వేసి బాగా కలపాలి. అన్నీ వేగాక తగినంత ఉప్పూ, మిరియాలపొడీ, ఉడికించిన నూడుల్స్ వేసుకుని బాగా కలిపి రెండుమూడు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.