header

Noodles Soup / నూడుల్స్ సూప్

Noodles Soup / నూడుల్స్ సూప్

కావలసినవి
సాదా నూడుల్స్ – కప్పు
క్యారెట్ – ఒకటి
బీన్స్ – ఆరు
వెల్లుల్లి తరుగు
అల్లం తరుగు - చెంచా చొప్పున
ఎండుమిర్చి – రెండు
కొత్తిమీర – కట్ట
సోయాసాస్ - రెండు చెంచాలు
వెనిగర్ - రెండు చెంచాలు
చిల్లీగార్లిక్ సాస్ – చెంచా
చక్కెర – అరచెంచా
కూరగాయలు ఉడికించిన నీరు - మూడు కప్పులు
కొబ్బరిపాలు – పావుకప్పు
ఉప్పు – తగినంత
నూనె - చెంచా.
తయారు చేసే విధానం
నూడుల్స్ను ముందుగా ఉడికించుకుని వెంటనే చల్లనినీటిలో వేసి తరవాత వడకట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగూ, క్యారెట్, కొత్తిమీర, బీన్స్ ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక కూరగాయలు ఉడికించిన నీరూ, తగినంత ఉప్పూ వేయాలి. కూరగాయముక్కలు సగం ఉడికాక చిల్లీ గార్లిక్ సాస్, వెనిగర్, సోయాసాస్, చక్కెరా, కొబ్బరిపాలూ, నూడుల్స్ వేయాలి. కాస్త చిక్కగా అవుతున్నప్పుడు దింపేస్తే చాలు.