header

Oats Dosa....ఓట్స్ దోసె

Oats Dosa....ఓట్స్ దోసె కావలసినవి :
ఒక కప్పు ఓట్స్
పావుకప్పు బియ్యం పిండి
పావుకప్పు బొంబాయి రవ్వ
ఒక టీస్పూన్ జీలకర్ర
ఒక పచ్చి మిరపకాయ
కొద్దిగా మిరియాలపొడి
నూనె
ఉప్పు
తగినంత నీరు
తయారు చేయువిధానం : ఓట్స్ ను నాలుగు నిమిషాలు పొడిగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మొత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్రలో ఓట్స్ పొడి, బియ్యం పిండి, రవ్వ, జీర, ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు మిరియాల పొడి, ఉప్పు కొద్దిగా నీరు పోసి దోసె పిండి లాగా కలుపుకోవాలి. పెనం వేడిచేసి రవ్వదోసెల మాదిరిగా వేసి అంచుల వెంబడి నూనె కొద్దిగా వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండువైపులా కాల్చాలి.