header

Oats Idly....ఓట్స్ ఇడ్లీ

Oats Idly....ఓట్స్ ఇడ్లీ కావలసినవి :
ముప్పావు కప్పు ఓట్స్
అరకప్పు రవ్వ
ఒక కప్పు పెరుగు
కొద్దిగా బేకింగ్ పౌడర్
తగినంత ఉప్పు
రెండు స్పూన్ల నూనె
ముప్పావు స్పూన్ జీలకర్ర
కొద్దిగా ఇంగువ
మిరియాల పొడి : పావు స్పూన్
చిన్న అల్లంముక్క సన్నగా తుముకోవాలి
ఒక క్యారెట్ తురుము
తాజా కొతిమీర కొద్దిగా
కరివేపాకు రెండు రెమ్మలు
తయారు చేయువిధానం : : ఓట్స్ వేయించి పొడి చేసుకోవచ్చ లేదా అలాగే వాడవచ్చు. క్యారెట్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించి అన్నీ కలిపి నీరుపోసి ఇడ్లీ పిండిలాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్ల లో మామూలు ఇడ్లీ లాగా వండుకోవాలి. ఏదైనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.