header

Bread Pakodi


బ్రెడ్ పకోడి

కావలసిన పదార్ధాలు
శనగ పిండి : రెండు కప్పులు
బ్రెడ్ పొడి : ఒక కప్పు
బియ్యం పిండి : అరకప్పు
కొత్తిమిర తురుము : అరకప్పు
కరివేపాకు : అరకప్పు
వెన్న : 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు: 2
కారం : 1టీస్పూన్
ఉప్పు : తగినంత
జీలకర్ర : అరటీస్పూన్
బేకింగ్ సోడా : చిటికెడు
నూనె : తగినంత
• తయారుచేయు విధానం
ఒక పెద్ద పాత్రలో శనగపిండి,బ్రెడ్ పొడి,బియ్యం పిండి,కొత్తిమిర తురుము,వెన్న,తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు,కారం,ఉప్పు,జీలకర్ర,బేకింగ్ సోడా వేసి నీరు నెమ్మదిగా కలుపుతూ కాస్త గట్టిగా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా పిండి ముద్దని తీసుకుని నూనెలో వేసి దొరగా వేయించుకోవాలి. వేడిగా తింటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. బ్రెడ్ పొడిగా కాకుండా చిన్న చిన్న సైజ్ ముక్కలుగా కోసి పిండిలో ముంచి కూడా వేయవచ్చు