కాకరకాయలు : పావు కిలో
వాము 1 టేబుల్ ;స్పూను
బియ్యపు బిండి : 2 స్పూన్లు
శెనగపిండి : 250 గ్రా
అల్లం, వెల్లుల్లి : ఒకటిన్నర టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
జీలకర్ర పొడి : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
ఏదైనా నూనె ఆయిల్ : వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం
పొడవుగా ఉన్న కాకరకాయల్ని తీసుకోండి శుభ్రం చేశాక కాకరకాయలను చాకుతో పొడవుగా సన్నగా లేక చ్రకాల లాగా తరగండి. ఈ ముక్కల్ని ఉప్పు కలిపి కొద్దిగా ఉడికించండి. ఓ గిన్నెలో శెనగపిండి కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, కారం, జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో కాసిన్ని నీళ్లు పోసి కొద్ది జావగా కలపండి.
స్టవ్ వెలిగించి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత చల్లారిన కాకరకాయ ముక్కల్ని పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించండి. కాకరకాయ పకోడి తయారు.