header

Mashala Pakodi


మషాలా పకోడి

కావల్సినవి
శెనగపిండి : పావుకిలో
బియ్యం పిండి : 2 సూన్లు
ఉల్లిపాయలు : 3 లేక 4 పెద్దవి
పచ్చిమిర్చి : 6 నిలువుగా చీల్చుకోవాలి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
లవంగాలు : 4
గరం మషాలా : కొద్దిగా
కరివేపాకు : కొద్దిగా
కొత్తీమీర : అరకట్ట
పొదీనా : 1 కట్ట
తయారు చేసే విధానం
ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని నిలువుగా సన్నగా తరుగుకోవాలి.
ఒక వెడల్పాటి పాత్రలో శెనగపిండి, పైన చెప్పిన మిగతా పదార్ధాలు వేసి 5,10 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఇందువల్ల ఉల్లిపాయ ముక్కలలో నీరు ఊరుతుంది. తరువాత వీటన్నిటిని గట్టిగా కలిపాలి. సాధారణంగా ఉల్లి పాయల నుండి వచ్చిన నీరే సరిపోతుంది. లేకపోతే కొద్దిగా నీరు కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి.
తరువాత పొయ్యిమీద బాణాలి పెట్టి తగినంత నూనె పోసి వేడెక్కిన తరువాత పిండిని కొద్ది కొద్దిగా వేయాలి. దోరగా కాలిన తరువాత తీయాలి. ఈ తరహా పకోడీలకు నూనె ఎక్కువగా పట్టదు.