header

Mixed Veg Pakodi


మిక్స్ డ్ వెజ్ టబుల్ పకోడి

కావల్సినవి
క్యాప్సికమ్, కేరెట్, బీన్స్, బంగాళాదుంప, కేలిఫ్లవర్, వంకాయ ముక్కలు అన్నీ కలిపి 150 గ్రాములు దాకా తీసుకోవాలి. అన్నీటినీ సమానంగా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా చూసుకోవాలి.
శెనగపిండి : 200 గ్రాములు లేక పావుకిలో
బియ్యం పిండి : 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు : కొద్దిగా
కొత్తీమీర : చిన్న కట్ట
పచ్చిమిర్చి : 4 కాయలు చిన్నగా తరగాలి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
ఉల్లిపాయ : పెద్దది ఒకటి (పొడుగ్గా తరుక్కోవాలి)
ఉప్పు : తగినంత
తయారు చేసే పద్ధతి
పైన చెప్పిన కూరగాయ ముక్కలను ఒక వెడల్పాటి పాత్రలో వేసి శెనగపిండి, బియ్యం పిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అందులో వేసి తగినంత నీరుపోసి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా ఇష్టంలేని వారు కొద్దిగా జారుగా కలుపుకోవాలి.
పొయ్యిమీద బాణాలి పెట్టి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత కొద్ది కొద్దిగా పిండిని నూనెలో వేసి దోరగా కాలనిచ్చి తీయాలి. వీటిని న్యూస్ పేపరమీద గానీ, టిస్యూ పేపర్ మీద గానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీలుస్తుంది. వీటిని అలాగే తినవచ్చ లేదా పొదీనా, అల్లం, టమాటో చట్నీతో గానీ తినవచ్చు. సాస్ లలో పంచదార, నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు.