header

Ribbon Pakodi


రిబ్బన్ పకోడీలు

కావలసిన పదార్ధాలు
శనగపిండి ఒక కిలో
లవంగాల పొడి : 5 గ్రాములు
అల్లం వెల్లుల్లి పెస్ట్ :50 గ్రాములు
పచ్చిమిర్చి ముద్ద :25 గ్రాములు
వరిపిండి :50 గ్రాములు
ఉప్పు : రుచికి సరిపడా కలుపుకోవాలి
నూనె :సరిపడా
నీళ్ళు :తగినన్ని
తయారుచేసే పద్ధతి
పచ్చిపప్పు ఎండబెట్టి మెత్తగా మరపట్టించుకుంటే పిండి మెత్తగా వస్తుంది లేదా శనగపిండిని నమ్మకమైన సూపర్ బజార్లలో కొనుగోలు చేయాలి. చిన్న చిన్న దుకాణాలలో బటానీ పిండి కల్తీ చేయగల అవకాశం ఉంది. లేదా నిల్వ ఉండి వాసన రావచ్చు. తరువాత అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి మొత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో శనగపిండి, వరిపిండి,గ్రైండ్ చేసిన మిశ్రమం, తగినంత ఉప్పు, నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా కలుపుకొవాలి. తరువాత స్టౌ వెలిగించి పాన్ కాని, బాణాలికాని పెట్టి సరిపడా నూనె పొసి నూనె వేడెక్కిన తరువాత ఈ పిండిని జంతికల గొట్టంలో రిబ్బన్ బిళ్ళను పెట్టి నొక్కాలి. చక్కగా కాలిన తరువాత తీసుకోవాలి. న్యూస్ పేపర్ మీదకానీ టిస్యూ పేపర్లమీద కానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనెను పీల్చకుంటాయి. ఆరనిచ్చి గాలి చోరని డబ్బాలలో నిల్వ చేసుకోవాలి. లవంగాల పొడి ఇష్టం లేని వారు తీసివేయవచ్చు. కారం ఎక్కువగా తినేవారు పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెంచుకోవచ్చు. లేక తగ్గించుకోవచ్చు.