header

Smooth Pakodi


మెత్త పకోడీలు

కావలసిన పదార్ధాలు
శనగపిండి – 250 గ్రాములు
నూనె – బాణాలిలోకి సరిపడినంత
ఉల్లిపాయలు : పెద్దవి రెండు
పచ్చిమిర్చి : 4 కాయలు
జీలకర్ర – 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
కారం – టీస్పూన్
వాము : టేబుల్ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
కొత్తిమీర : కొద్దిగా
• తయారుచేయు విధానం
పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుగుకోవాలి. శెనగపిండిలో ఇవన్నీ కలిపి, తగినంత ఉప్పువేసి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి.
పొయ్యిమీద బాణాలీ పెట్టి తగినంత నూనె పోసి వెడెక్కిన తరువాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని నూనెలో వేయాలి. దోరగా కాలిన తరువాత టిస్యూ పేపర్ మీద గానీ, న్యూస్ పేపర్ మీదగానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకుంటుంది.