header

Thotakura Pakodi


తోటకూర పకోడీలు

కావలిసినవి
తోటకూర కట్టలు : 4
శెనగపిండి : పావుకిలో
ఉప్పు : తగినంత
నూనె
బేకింగ్ పౌడర్ : కొద్దిగా (చిటికెడు)
తయారు చేసే విధానం
ముందుగా తోటకూరను కాడలు తీసివేసి ఆకులను ఉప్పునీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఇందువల్ల తోటకూరలో ఉన్న మందుల అవశేషాలు, మురికి పోతుంది.
తరువాత తోటకూర ఆకులను కొద్దిగా చిన్న ముక్కలుగా తుంచి శెనపిండిలో వేసి ఉప్పు, బేకింగ్ పౌడర్, తగినంత నీరు పోసి కొద్దిగా జావగా కలుపుకోవాలి మరీ జావగా కలపకూడదు. నూనె ఎక్కువగా పీలుస్తుంది. పొయ్యిమీద బాణాలి పెట్టి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత తయారుగా ఉన్న పిండిని కొద్ది కొద్దిగా నూనెలో వేయాలి. దోరగా వేగిన తరువాత తీయాలి. వీటిని టిస్యూ పేపర్ మీద గానీ న్యూస్ పేపర్ మీద కానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకుంటుంది.