చింతకాయలు- పావుకిలో
పచ్చిరొయ్యలు- అరకిలో
పసుపు- కొద్దిగా
కారం- రెండు చెంచాలు
నూనె- తగినంత
ఉల్లిపాయలు - 2
అల్లం- కొద్దిగా
ఉప్పు- తగినంత
ముందుగా చింతకాయల్ని కొద్దిగా దంచి అందులోని గింజలను తీసివేయాలి . వీటిని రోట్లోకానీ మిక్సీలో కానీ వేసి పసుపు, ఉప్పు వేసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్ లో నూనె వేసి అందులో ఉల్లిపాయల ముక్కలు, పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు శుభ్రం చేసిన పచ్చిరొయ్యలని అందులో వేసి మగ్గించుకోవాలి. దంచిన అల్లం కూడా వేసుకుని బాగా కలిపి అందులో నూరిన చింతకాయ మిశ్రమాన్ని వేసి కలియ తిప్పాలి. కాసేపటికి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కారం కూడా వేసి కొద్దిగా నీరు పోసుకుని మూత పెట్టేయాలి.
చింత పులుపు రొయ్యలకు పట్టి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్లు కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చు.