header

Moghalayee Curry / మొఘలాయి రొయ్యల కూర..


Moghalayee Curry / మొఘలాయి రొయ్యల కూర..
కావల్సినవి
రొయ్యలు- 250 గ్రాములు
ఉల్లిపాయలు- రెండు
టొమాటోలు - రెండు
వెల్లుల్లి రేకలు - 10
అల్లం ముక్క - చిన్నది
గరం మసాలా- అరచెంచా
పసుపు - అరచెంచా
పచ్చిమిర్చి – రెండు కాయలు
కారం - చెంచా
ధనియాలు - చెంచా
నెయ్యి - రెండు చెంచాలు
నీళ్లు- రెండు కప్పులు
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం
రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి , ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లీ, ధనియాలు మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక మెత్తగా చేసుకున్న ఉల్లిపాయ ముద్ద, తగినంత ఉప్పూ, గరంమసాలా, కారం, పసుపు వేయాలి. పచ్చివాసన పోయాక కప్పు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు కాస్త మరిగాక టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి మిగిలిన నీళ్లు పోసి, మూత పెట్టాలి. రొయ్యలు కూడా ఉడికి కూరలా తయారయ్యాక దింపేయాలి.