header

Prawns Curry / రొయ్యల కర్రీ


Prawns Curry / రొయ్యల కర్రీ
కావల్సినవి
రొయ్యలు - పెద్ద సైజువి 15
ఆవనూనె- నాలుగు చెంచాలు
లవంగాలు - మూడు
బిర్యానీ ఆకులు - మూడు
ఉల్లిపాయ - ఒకటి
అల్లం తరుగు - చెంచా
వెల్లుల్లి రేకలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
కొబ్బరి తురుము -పావుకప్పు
కారం - చెంచా
కొబ్బరిపాలు - అరకప్పు
నీళ్లు- అర కప్పు
పసుపు - అర చెంచా ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - చెంచా
క్రీం - రెండు చెంచాలు
తయారు చేసే విధానం
రొయ్యల్ని ఒక గిన్నెలో తీసుకుని పసుపూ, ఉప్పు కలిపి పావుగంట సేపు నానబెట్టాలి. ఇంతలో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలూ, పచ్చిమిర్చీ, కొబ్బరి తురుమూ, కాసిని నీళ్లు తీసుకుని మిక్సీలో మెత్తని ముద్దలా చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి రెండు చెంచాల ఆవనూనె వేసి రొయ్యల్ని వేసి వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి లవంగాలూ, బిర్యానీ ఆకులు వేయించి ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. పచ్చివాసన పోయాక కారం, చక్కెర, ఉప్పూ, కొబ్బరిపాలూ పోయాలి. పాలు ఉడికాక రొయ్యలు వేయాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది. అప్పుడు కొత్తిమీర తరుగూ, క్రీం వేసి దింపేయాలి.