రొయ్యలు - పావుకేజీ
నూనె- మూడు చెంచాలు
దాల్చినచెక్క - చిన్నముక్క
జీలకర్ర - చెంచా
యాలకులు - రెండు
ఉల్లిపాయ - ఒకటి పెద్దది
పచ్చిమిర్చి - ఒకటి
కరివేపాకు - రెండు రెబ్బలు
అల్లం, వెల్లుల్లి పేస్టు - చెంచా
కారం - చెంచా
ధనియాల పొడి - చెంచా
పసుపు - పావు చెంచా
గరంమసాలా - అర చెంచా
మిరియాల పొడి - అర చెంచా
టొమాటోలు - రెండు
ఉప్పు - తగినంత
నీళ్లు - అర కప్పు
మసాలా కోసం:
అల్లం వెల్లులి ముద్ద - చెంచా, కారం - చెంచా, ధనియాల పొడి - రెండు చెంచాలు, పసుపు - అరచెంచా, గరం మసాలా - అర చెంచా, మిరియాల పొడి - చెంచా, ఉప్పు - తగినంత.
ఒక గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలపై మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. పది నిమిషాలయ్యాక పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె పోయాలి. అందులో రొయ్యలు వేసి వేయించి తీసుకోవాలి. అదే నూనెలో దాల్చినచెక్కా, యాలకులూ, జీలకర్ర వేయించి ఉల్లిపాయముక్కలూ, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. తరువాత అల్లం,వెల్లులి ముద్దా, తగినంత ఉప్పూ, కారం, ధనియాలపొడీ, పసుపూ, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో టొమాటో ముక్కలు వేసి కాసిని నీళ్లు పోయాలి. టొమాటో ముక్కలు ఉడికాక ముందుగా వేయించిపెట్టుకున్న రొయ్యలు వేసి మంట తగ్గించాలి. అవి ఉడికాక దింపేస్తే చాలు.