రొయ్యలు - పావుకేజీ
పప్పునూనె- రెండు చెంచాలు
మిరియాల పొడి - చెంచా
కారం - చెంచా
పసుపు - అరచెంచా
ధనియాల పొడి - చెంచా
యాలకులు - రెండు
సోంపు - చెంచా
కరివేపాకు - మూడు రెబ్బలు
ఉల్లిపాయలు - రెండు
టొమాటోలు - రెండు
అల్లం, వెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు
ఉప్పు- తగినంత
కొత్తిమీర తరుగు - 2 చెంచాలు
పొదీనా తరుగు : 2 చెంచాలు
అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక సోంపూ, యాలకులూ, కరివేపాకు వేయాలి. అవి వేగాక ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. ఎర్రగా వేగాక టొమాటో ముక్కలూ, అల్లంవెల్లుల్లి ముద్దా, ధనియాల పొడీ, మిరియాల పొడీ, పసుపూ, కారం, ఉప్పు వేసి మరోసారి వేయించుకోవాలి. టొమాటో ముక్కలు ఉడికి నూనె పైకి తేలాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. రొయ్యలు మెత్తగా అయ్యాక కొత్తిమీర తరుగు, పొదీనా తరుగు వేసి దింపేయాలి.