header

Atukula Pulihora

atukula pulihora
అటుకుల పులిహోర

కావలసిన పదార్థాలు
అటుకులు : 4 కప్పులు
ఉల్లిపాయముక్కలు : 2 కప్పులు
కారెట్ తురుము : 1 పెద్ద క్యారెట్ తురుము
వేరుశనగ గుళ్ళు : 50 గ్రాములు
పచ్చిమిర్చి : 6 నిలువుగాచీలికలు చేసుకోవాలి
పోపుదినుసులు : కొద్దిగా
కరివేపాకు
ఇంగువ : చిటికెడు
ఉప్పు : సరిపడినంత
పసుపు : కొద్దిగా
నిమ్మకాయలు : 2 రసం కాయలు
కొత్తిమీర : 1 కట్ట
నూనె : తిరగమాతకు కొద్దిగా
తయారీ విధానము
ముందుగా అటుకులను శుభ్రంగా బాగుచేసి కడిగిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత పోపుదినుసులు, కరివేపాకు వేసి, వేగిన తరవాత, వేరుసెనగ గుళ్ళు, ఇంగువ వేసి, క్యారెట్ అన్ని వేసి బాగా కదిపి, అన్ని వేగాక అటుకులు, ఉప్పు పసుపు వేసి బాగా కదిపి, అన్ని కలిసాక స్టవ్ మీద నుండి దించుకొని సన్నగా తురిమిన కొత్తిమీర చల్లుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ రసం వేసుకోవచ్చును. వేడి వేడి అటుకుల పులిహోర ..... తయారు