కావలిసినవి
బియ్యం : 2 కప్పులు (లేక ఆరుకప్పుల ఉడికిన అన్నం)
పుల్లమామిడి తురుము : 2 కప్పులు
ఉప్పు : రుచికి సరిపడ
పసుపు : అరటీ స్పూన్
పోపుగింజలు : కొద్దిగా
పచ్చిమిర్చి : నిలువుగా చీల్చినవి 6
అల్లం : రెండు అంగుళాలు
వేరుశెనగ గుండ్లు : 50 గ్రాములు
కరివేపాకు
ఎండుమిర్చి : 4
ఇంగువ : చిటికెడు
తయారు చేసే పద్దతి
ముందుగా బియ్యాన్ని నానబెట్టి అన్నం పొడి పొడిగా ఉండేటట్లు వండుకోవాలి. వండిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి పూర్తిగా చల్లారిన తరువాత కొద్దిగా నూనె పసుపు కలుపుకోవాలి.
వేరుశెనగ గుళ్ళను దోరగా వేయించి పైన పొట్టుతీసి పెట్టుకోవాలి.
ముందుగా పొయియమీద బాణాలి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత ఎండుమిర్చి, తాలింపుగింజలు వేసి అవి కూడా వేగిన తరువాత, వేరుశెనగ గుండ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అన్నీ దోరగా వేగిన తరువాత ఉప్పు, మామిడి తురుము వేసి 2-3 నిమిషాలు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దించుకొని వెడల్పాటి పాత్రలో ఉన్న అన్నంలో కలుపుకోవాలి.
చేతులు శుభ్రంగా కడుక్కొని పొడి చేతులతో అన్నీ కలిసేటట్లు నెమ్మదిగా చక్కగా కలపాలి లేదా అన్నం ముక్కలుగా మారుతుంది. ఇష్టమైన వారు ఇందులో కొత్తిమీర, క్యారెట్ తురుము కలుపుకోవచ్చు. పులుపు మామిడి కాయల సైజ్, మామిడి రకాలను బట్టి ఉంటుంది కనుక అవసరాన్ని బట్టి మామిడి
తురుము కలుపుకోవాలి.