

 
   
బాస్మతి బియ్యం: పావుకిలో 
 పుదీనా: 2 కట్టలు 
కొత్తిమీర: 3 కట్టలు 
 పచ్చిమిర్చి: మూడు 
 జీలకర్ర: 4 టీస్పూన్లు 
 క్యారెట్: ఒకటి 
 బేబీకార్న్: ఆరు 
 ఉల్లికాడలు: నాలుగు 
 నూనె: 2 టేబుల్స్పూన్లు 
 ఉప్పు: రుచికి సరిపడా
బియ్యం కడిగి, అరగంట నానబెట్టిన తరువాత పొడి పొడిగా అన్నం వండుకొని ఉంచుకోవాలి.  పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. 
క్యారెట్, బేబీకార్న్ను కాస్త పెద్దముక్కలుగా కోయాలి.  వెడల్పాటి బాణలి తీసుకుని అందులో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా వేయించాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, బేబీ కార్న్, ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. తరవాత ఉడికించిన అన్నం వేసి, ఉప్పు వేసి కలిపి దించి రైతాతో వడ్డించాలి.