|
తిరిగి వెనుకకు - |
కేరట్ రైస్ | |
కావలసినవి : బియ్యం: 2 కప్పులు బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి కేరెట్ : 6 కేరెట్ల తురుము ఉల్లిపాయ : 1 సన్నగా తరిగినది పచ్చి మిరపకాయలు : సన్నగా తరిగినివి 4 పసుపు : అరటీ స్పూన్ ఉప్పు : తగినంత నూనె : 3 టీస్పూన్లు తాలింపునకు కావలిసినవి: ఆవాలు : అరటీస్పూన్ జీలకరకర : అర టీస్పూన్ ఛాయమినపప్పు : 1 టీ స్పూన్ ధనియాలు : 1 టీ స్పూన్ తురిమిన కొబ్బరి : 2 టీస్పూన్లు వేరుశెనగ గుండ్లు : రెండు టీ స్పూన్లు కరివేపాకు : తగినంత తయారు చేయువిధానం : అన్నం విడిగా వండి పక్కన పెట్టుకోవాలి (అన్నం మొత్తగా కాకుండా పొడి పొడిగా ఉండాలి). నూనె వేడిచేసి తాలింపు పదార్ధాలు వేసి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, 3 ఎండు మిర్చి, రెండుస్పూన్ల తురిమిన కొబ్బరి, కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేసి మాడకుండా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తురిమిన కేరట్ మరియు పసుపు కలిపి ఇంకో రెండు నిమిషాలపాటు వేయించాలి. తరువాత రైస్ వేసి ఉప్పు కలపాలి కొద్దిసేపు ఉంచి దించుకోవాలి. తరువాత కొద్దిగా కొతిమీర చల్లితే సువాసనగా ఉంటుంది. |
Ingredients |