కాలీఫ్లవర్ - 1 మీడియం సైజ్
బియ్యం- 200 గ్రాములు
బఠాణీలు- అరకప్పు
పచ్చిమిర్చి- 6
జీలకర్ర- టీస్పూను
అల్లంవెల్లుల్లి ముద్ద- టీస్పూను
పసుపు- చిటికెడు
గరం మసాలా- 1 టీస్పూను
కొత్తిమీర- కొద్దిగా
నూనె- 23 టేబుల్‌స్పూన్లు
ఉప్పు- తగినంత.
బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టుకొని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ పువ్వులను విడదీసి ఉప్పునీటిలో కడిగి శుభ్రం చేసుకొని చిన్నముక్కలుగా చేసుకోవాలి. వీటిలో ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాలు ఉడికించి ఆరబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి ముదురు ఎరుపు రంగు వచ్చే దాకా వేగించాలి.
బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత కాలిఫ్లవర్ ముక్కలు, అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి దించేయాలి.