header

Chicken Rice / చికెన్ రైస్

Chicken Rice / చికెన్ రైస్

కావల్సినవి:
బియ్యం - పావుకిలో
చికెన్ – 150 గ్రాములు
ఉల్లిపాయ – ఒకటి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్
పొడుగ్గా తరిగిన క్యారెట్ – అరకప్పు
ఉడికించిన పచ్చిబఠాణీ - పావుకప్పు (అవి లేకపోతే ఎండుబఠాణీని నానబెట్టి ఉడికించుకోవాలి)
వెన్న - టేబుల్స్పూను
కొత్తిమీర తరుగు - రెండు టేబుల్స్పూన్లు
నూనె - టే2 బుల్స్పూను
ఉప్పు – తగినంత
మిరియాలపొడి - చెంచా
తయారు చేసే విధానం:
బియ్యాన్ని అరగంటసేపు నానపెట్టి పొడి పొడిగా వండుకోవాలి. తరువాత చికెన్ ను చిన్నచిన్న ముక్కలుగా చేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తరువాత బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె లేక నెయ్యి వేయాలి. అది వేడెక్కిన తరువాత ఉల్లిపాయ ముక్కలూ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తరువాత క్యారెట్ తరుగూ, ఉడికించిన పచ్చిబఠాణీ వేసి వేయించాలి. క్యారెట్ కూడా వేగిన తరువాత చికెన్ ముక్కలూ తగినంత ఉప్పూ, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. ఇది కూరలా తయారయ్యాక అన్నం, వెన్న, కొత్తిమీర తరుగూ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి.