Curry Leaf Rice |
తిరిగి వెనుకకు - |
కరివేపాకు రైస్ |
కావలసినవి : బాస్మతి రైస్ : 2 కప్పులు ఉప్పు : తగినంత పసుపు : చిటికెడు కరివేపాకు పౌడర్ తయారీకి: కరివేపాకు : ఒక కప్పు ఛాయ మినపప్పు : 2 టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు : 1 టేబుల్ స్పూన్ చిన్నుల్లి పాయ: 2 రెబ్బలు మిరియాలు : 2 గింజలు ఎండు మిర్చి: 5 కాయలు కొబ్బరి తురుము : 2 టీ స్పూన్లు తాలింపుకు : ఇంగువ : చిటికెడు ఆవాలు : ఒక స్పూను నూనె : 2 టేబుల్ స్పూన్లు తయారు చేయువిధానం : ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టి పొడిగా ఉండేటట్లు వండుకోవాలి. బాణాలిలో సన్నని సెగ మీద చిన్నుల్లి పాయ రెబ్బలు, ఎండు మిర్చి, మిరియాలు, కొబ్బరి తురుము మంచి రంగు వచ్చేదాకా మాడకుండా వేయించుకోవాలి. తరువాత కరివేపాకు వేసి పచ్చిదనం పోయే వరకు వేయించాలి. వేగిన తరువాత దించి చల్లారిన తరువాత మొత్తగా పొడి చేసుకోవాలి. పాన్లో నూనె పోసి వేడి చేసిన తరువాత ఆవాలు, ఇంగువ వేయాలి. తరువాత వండిన అన్నం, కరివేపాకు పౌడర్, పసుపు, ఉప్పు వేసి కలియ తిప్పాలి. |