header

Egg Fried Rice …..

Egg Fried Rice …..

కావల్సినవి
రైస్ - అరకిలో
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 8
క్యారెట్ - 1
కాప్సికమ్ – 1
కొత్తిమీర - కొద్దిగా
గుడ్లు - 4
మిరియాల పొడి - 1 టీస్పూన్
నూనె - 3 టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
తయారు చేసే విధానం
ముందుగా బియ్యం అరగంటసేపు నానబెట్టుకొని పొడిపొడిగా వండుకోవాలి. ఉల్లిపాయలును, పచ్చిమిర్చిని సన్నగా తరుగుకోవాలి.
క్యారెట్ ను శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి క్యాప్సికమ్ ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు పొయ్యిమీద పాన్ పెట్టి సగం నూనె వేసి వేడెక్కిన తరువాత. ఒక్కో గుడ్డు పగలకొట్టి వేయాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరియు ఒక టీస్పూన్ మిరియాలు పొడి వేయాలి. గుడ్డు బాగా విడిపోయి చిన్న చిన్న ముక్కలుగా మారేవరకు గరిటతో తిప్పుతూ వేయించాలి. మాడి పోకుండా మద్యమద్యలో గరిటతో కలుపుతూ ఉండాలి. గుడ్డు బ్రౌన్ రంగులోకి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేయాలి. అల్లం మరియు వెల్లుల్లి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు తరిగిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలను , అలాగే ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి.
రెండు నిముషాల తర్వాత ముందుగా వండుకున్న అన్నం వేసి కలపాలి. తరువాత, ఫ్రై చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. దింపేముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఇది సుమారు 5 గురికి సరిపోతుంది.