|
తిరిగి వెనుకకు - |
జీరా రైస్ | |
కావలసినవి : బాస్మతి బియ్యం : 2 కప్పులు (కడిగి అరగంటసేపు నాన పెట్టాలి) నెయ్యి లేక నూనె : 2 టీ స్పూన్లు సిలాంట్రో : గుప్పెడు ఆకులు ఉల్లిపాయ : చిన్నది 1 తరిగినది పచ్చి మిరప కాయలు : 2 సన్నగా చీల్చినవి జీలకర్ర : 1 టీ స్పూన్ గరమ్ మసాలా : 1 టీ స్పూన్ ఉప్పు : సరిపడా నీళ్ళు : 3 కప్పులు తయారు చేయువిధానం : బియ్యం కడగి అరగంట సేపు నాన పెట్టు కోవాలి. ఒక వెడల్పాటి పాన్లో నూనె లేక నెయ్యు వేసి వేడెక్కిన తరువాత గరం మసాలా, జీలకర్ర వేయాలి. తరువాత ఉల్లిపాయలు వేసి కొద్ది సేపు వేయించాలి. తరువాత పచ్చి మిర్చి, సిలాంట్రో ఆకులు, నీరు, వడకట్టిన బియ్యం కలిపి అన్నం ఉడికేదాకా ఉంచి దించుకోవాలి. పెరుగు చట్నీతో కానీ ఏదైనా కుర్మాతో కానీ తినవచ్చు. |
Ingredients |