header

Katte-pongali …కట్టె పొంగలి

Katte-pongali …కట్టె పొంగలి

కావల్సినవి
బియ్యం- పావుకిలో
పెసరపప్పు- 150 గ్రాములు
ఉప్పు- తగినంత.
తాలింపు కోసం:
నెయ్యి- మూడు చెంచాలు
జీలకర్ర- చెంచా
మిరియాలు- చెంచా
అల్లం - చిన్న ముక్క
కరివేపాకు- నాలుగు రెబ్బలు
జీడిపప్పులు- పది
తయారు చేసే విధానం
బియ్యం, పెసరపప్పు కలిపి అరగంటసేపు నానబెట్టకోవాలి. తరువాత బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కి కరిగాక జీడిపప్పు వేయించాలి. అవి కాస్త ఎర్రగా వేగాక జీలకర్రా, మిరియాలపొడీ, కరివేపాకూ, అల్లం తరుగు వేయాలి. అవి కూడా వేగాక సరిపడా నీళ్లు పోసి (1 టికి రెండున్నర చొప్పున) బాగా మరగనివ్వాలి
నీళ్లు సలసలా మరిగిన తరువాత నానబెట్టిన పెసరపప్పు, బియ్యం, ఉప్పు వేసి బాగా కలియతిప్పాలి. పూర్తిగా ఉడికి తరువాత దించుకోవాలి. ఇష్టమున్న వారు కొత్తిమీర తురుము చల్లుకోవచ్చు. ఇది వేడిగా అల్లం చట్నీ గానీ, ఏదైనా చట్నీతో గానీ తినవచ్చు