|
తిరిగి వెనుకకు - |
మెంతి రైస్ | |
కావలసినవి : బాస్మతి బియ్యం – 2 కప్పులు మెంతి ఆకుల కట్ట – ఒకటి పచ్చిమిరపకాయలు – మూడు సన్నగా పొడవుగా తరిగినవి పెరుగు – టీ స్పూన్లు పసుపు – పావు టీ స్సూను ధనియాల పౌడర్ – 1 టీ స్సూను జిలకర్ర పౌడర్ – 1 స్పూను జిలకర్ర – అర టీ స్పూను నూనె – 1 టీ స్పూను ఉప్పు – తగినంత నీళ్ళు – మూడున్నర కప్పులు తయారు చేయువిధానం : బియ్యాన్ని 15 నిమిషాలపాటు నానబెట్టాలి. మెంతి ఆకును కాడలనుంచి వేరుచేయాలి. పాన్ లో నూనెను వేడిచేసి జిలకర్రను వేయాలి. తరువాత తరిగిన మిర్చి, పసుపు, ధనియాల పౌడర్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత మెంతి ఆకులు కూడా వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి. తరువాత నానబెట్టిన బియ్యం అందులో వేసి ఒక నిమిషం పాటు ఉంచి, నీరు కలపాలి మొత్తాని కలతిప్పాలి. అన్నం పూర్తిగా ఉడికిన తరువాత దించి వేడిగా తింటే బాగుంటుంది. దీనిలోకి పెరుగు చట్నీ వడ్డించవచ్చు. |
Ingredients |