telugu kiranam

Palak Rice / పాలక్‌ రైస్‌

తిరిగి వెనుకకు -
Palak Rice / పాలక్‌ రైస్‌
కావలసినవి :
బియ్యం: అర కిలో

పాలకూర: ఆరు కట్టలు

నూనె: రెండుటేబుల్‌స్పూన్లు

యాలకులు: నాలుగు

లవంగాలు: నాలుగు

దాల్చినచెక్క: రెండు ముక్కలు

జీలకర్ర: అర టీస్పూను

పలావు ఆకు: రెండు

పచ్చిమిర్చి:ఆరు

ఉల్లిపాయ: రెండు


అల్లంవెల్లుల్లి: రెండు టీస్పూన్లు

గరంమసాలా: అరటీస్పూను

పసుపు: 1 స్పూను

ఉప్పు: కొద్దిగా

నిమ్మరసం: సగం నిమ్మకాయ రసం

జీడిపప్పు : కొద్దిగా

తయారుచేసే విధానం

తయారు చేయువిధానం : ముందుగా అన్నం పొడిపొడిగా ఉడికించి చల్లార్చుకోవాలి. పాలకూరను శుభ్రంగా కడిగి, ఓసారి వేడినీళ్లలో ముంచి తీసి సన్నగా తరుగుకోవాలి బాణలిలో నూనె వేసి మసాలా దినుసులన్నీ వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేవరకూ వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. గరంమసాలా, ఉప్పు, పసుపు వేసి కలిపి పాలకూర తరుగు వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. తరవాత చల్లార్చిన అన్నం వేసి కలిపి దించాక నిమ్మరసం కలిపి జీడిపప్పు పైన అలంకరించి వడ్డించాలి. ఎదిగే పిల్లలు మంచి పౌష్టికాహారం.