telugu kiranam

Pepper fried Rice….మిరియాల ఫ్రైడ్ రైస్

తిరిగి వెనుకకు -
కావలసినవి :
బాస్మతి బియ్యం – మూడు కప్పులు
నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
జీలకర్ర – ఒక టీ స్పూను
ఆవాలు –టీ స్పూను
నల్ల మిరియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
నువ్వులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
కరివేపాకు – 3 రెమ్మలు
ఉప్పు – రుచికి తగినంత
కొత్తిమీర - కొద్దిగా
తయారు చేయువిధానం : ముందుగా బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, గంటసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, ఒకటికి రెండు చొప్పున నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె లేకుండా మిరియాలు, నువ్వులు, కరివేపాకు వేసి దోరగా వేయించి తీసి, బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలితరువాత అదే బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి జీలకర్ర కూడా వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. దీనిలో ఉడికించిన అన్నం వేసి కలపాలి మెత్తగా పొడి చేసిన మిరియాల పొడి మిశ్రమం, ఉప్పు వేసి కలిపి దింపేయాలి. రుచి కోసం కొత్తిమీర తురుముకోవాలి