|
తిరిగి వెనుకకు - |
పొదినా రైస్ | |
కావలసినవి : బియ్యం : కడిగి నానపెట్టినవి : 2 కప్పులు ఉల్లిపాయ : 1 తరిగినది నిమ్మరసం : 2 స్పూన్లు నీళ్ళు : 3 కప్పులు ఉప్పు : తగినంత నూనె లేక నెయ్యి : 2 స్పూన్లు పొదినా ఆకులు : 1 కట్ట (1 కప్పు) కొతిమీర : కప్పు తురిమిన కొబ్బరి : 2 స్పూన్లు అల్లం : చిన్న ముక్క చిన్నుల్లి పాయ రెబ్బలు : 4 పచ్చిమిర్చి: సన్నగా తరిగినవి : 5 లేక 6 గరం మసాలా : అర స్పూను తాలింపు గింజలు : కొద్దిగా జీడిపప్పు లేక వేరుశెనగ గుండ్లు: కొద్దిగా కరివేపాకు : 2 రెమ్మలు తయారు చేయువిధానం : పొదినా ఆకులు, కొతిమేర, అల్లం, కొబ్బరి, చిన్నుల్లిపాయ రెబ్బలు అన్నీకలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాన్లో నూనె వేసి వేడిచేసిన తరువాత తాలింపుగింజలు వేసి కొద్దిగా వేగినతరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు వేసి మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తరువాత మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ గరం మసాలా వేసి కలపాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తరువాత 3 కప్పుల నీళ్ళ నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలపాలి. తరువాత నానబెట్టిన బియ్యం వేసి ఉడికిన తరువాత దించి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లాలి |
Ingredients |