header

Rice veg kichidi… కిచిడి....

Rice veg kichidi… కిచిడి....

బియ్యం: అరకిలో
పెసరపప్పు: 150 గ్రాములు
ఇంగువ: చిటికెడు
ఎండుమిర్చి: మూడు
ఆవాలు: పావు టీస్పూను
కారం: అరటీస్పూను
పచ్చిమిర్చి: నాలుగు
కరివేపాకు: నాలుగు రెబ్బలు
పసుపు: పావుటీస్పూను
ఉప్పు: తగినంత
బంగాళాదుంప: ఒకటి
బీన్స్: పది
క్యారెట్లు: రెండు
నెయ్యి: 4 టేబుల్స్పూన్లు
తయారు చేయువిధానం : బియ్యం ఏదైనా గ్లాసుతో కొలచుకోవాలి. తరువాత పెసరపప్పు, బియ్యం కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి. పాన్లో నెయ్యి వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి వేగనివ్వాలి. తరవాత కూరగాయల ముక్కలన్నీ వేసి, పసుపు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు గ్లాసు బియ్యానికి రెండు న్నర గ్లాసుల నీళ్లు పోసి మరిగిన తరవాత నానబెట్టిన బియ్యం, పెసర పప్పు, తగినంత ఉప్పు వేసి సిమ్లో ఉడికించి దించాలి. దించుకునే ముందు కొత్తిమీర తురుము చల్లుకోవాలి.