header

Thai Rice / ధాయ్ రైస్

Thai Rice / ధాయ్ రైస్

కావలసినవి
బాస్మతీ బియ్యం -250 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - పది
ఉల్లికాడల తరుగు – అర కప్పు
క్యాప్సికం - రెండు
నిమ్మరసం - చెంచా
మొక్కజొన్న గింజలు - కప్పు
సోయా సాస్ – చెంచా
ఎండుమిర్చి గింజలు – 1 చెంచా
రొయ్యలు – పది చిన్నవి
ఆలివ్నూనె – 2 స్పూన్లు
ఉప్పు -తగినంత
మిరియాలపొడి - అరచెంచా.
కొత్తిమీర : కొద్దిగా
తయారు చేసే విధానం
బియ్యాన్ని కడిగి అరగంటసేపు నానబెట్టిన తరువాత పొడిపొడిగా అన్నం వండుకోవాలి. తరువాత బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి మొక్కజొన్న గింజలూ, పొడుగ్గా తరిగిన క్యాప్సికం, వెల్లుల్లి రెబ్బలూ, ఉల్లికాడల తరుగూ వేసి వేయించుకోవాలి. ఐదారు నిమిషాలయ్యాక శుభ్రంచేసిన రొయ్యలూ, అన్నం, సోయాసాస్, ఎండుమిర్చి గింజలూ, తగినంత ఉప్పూ, మిరియాలపొడీ.. వేసి బాగా కలపాలి. రెండుమూడు నిమిషాలయ్యాక దించేముందు కొత్తిమీర తరుగు కలిపి దింపుకోవాలి