telugu kiranam

Veg Rice

తిరిగి వెనుకకు -
వెజ్ టబుల్ రైస్
కావలసినవి :
బాస్మతి బియ్యం : 2 కప్పులు (కడిగి అరగంట సేపు నాన పెట్టాలి)
ఉల్లిపాయలు : తరిగినవి – 1
అల్లం, వెల్లుల్లి పేస్టు – 1 టీ స్పూను
పచ్చి మిరపకాయలు – 3 సన్నగా చీల్చినవి
కూరగాయలు : 1 కప్పు తరిగినవి. (దుంపలు, బీన్స్, కేరెట్, పచ్చి బఠానీలు, క్యాలీఫ్లవర్)
పొదినా ఆకులు : 1 కట్ట
గరమ్ మసాలా : 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి : 1 టీ స్పూను
మిరియాల పొడి : 1 టేబుల్ స్పూను (ఎక్కువ స్పైసీగా కావాలనుకునే వారికి)
పసుపు పొడి : పావు స్పూను
నిమ్మరసం : 1 టీ స్పూను
ఉప్పు : తగినంత
బిర్యానీ ఆకు : ఒకటి
నెయ్యి లేక నూనె : 3- 4 టీ స్పూన్లు
నీరు : 3 కప్పులు
తయారు చేయువిధానం : ఒక వెడల్పాటి పాన్లో నూనె లేక నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. అల్లం, వెల్లులి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. తరువాత పొదినా, సిలాంట్రో ఆకులు వేసి కొద్దిగా వేయించాలి. తరువాత గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, వేసి కొద్దిగా వేయించాలి. తరువాత సన్నగా తరిగిన కూరగాయ ముక్కలను కలిపి ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నానబెట్టిన బియ్యం కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత నీరు, నిమ్మరసం, తగినంత ఉప్పు కలిపి బియ్యం ఉడికేదాకా ఉంచి దించుకోవాలి. ఇష్టమున్న వారు జీడిపప్పు, కొతిమీర కలుపుకోవచ్చు.