header

Badusha / బాదుషా

Badusha / బాదుషా
కావాలిసిన పదార్ధాలు

మైదా – కేజీ
వెన్న : పావుకేజీ
బేకింగ్ పౌడర్– రెండు స్పూన్లు
నూనె – కేజీ
పంచదార – కేజీ
నీళ్లు– తగినన్ని
యాలకులు – 5 (పొడి చేయాలి)
తయారు చేసే విధానం
నీళ్లు మరగపెట్టి పంచదార వేసి కొంచెం ముదురు పాకం వచ్చేంత వరకు స్టవ్పై ఉంచాలి, పాకంలో యాలకుల పొడి కలిపి దించి పక్కన పెట్టుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్ వేసి ముద్దగా కలపాలి. కాటన్ క్లాత్ కప్పి 5 నిమిషాలు ఉంచాలి. తరువాత పిండిని మరికాస్త మృదువుగా చేత్తో అదిమి, చిన్న చిన్న ఉండలు చేయాలి. వాటిని చేత్తో గుండ్రంగా అదిమి పక్కన పెట్టుకోవాలి
స్టవ్ వెలిగించి బాణాలి పెట్టి నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత బాదూషాలను వేసి వేయించాలి. తరువాత వాటిని పంచదార పాకంలో వేయాలి. పాకంలో 15 నిమిషాలు ఉంచి తీయాలి.