కావలిసిన పదార్ధాలు
పాలు :ల పాలుగుకప్పులు
కోవా : 100 గ్రాములు
పంచదార: ఒకటిన్నర కప్పులు
గోధుమనూక : మూడు టేబుల్ స్పూన్లు
వెన్న లేదా నెయ్యి : 4 స్పూన్లు
జీడిపప్పు :కొద్దిగా
బాదంపప్పులు :కొద్దిగా
కోకోపొడి : రెండు స్పూన్లు
పిస్తా పలుకులు : రెండు స్పూన్లు
చిన్న పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి గోధుమనూక వేసి మంచి సువాస వచ్చే వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి. తరువాత అడుగు మందం గల పాన్లో మధ్యస్థమంగా ఉండే సెగపై పాలు, కోవాలు వేడిచేయాలి.
మధ్యమధ్యలో కలియబెడుతూ మిశ్రమాన్ని చిక్కబడనివ్వాలి. ఇరవైనిమిషాలు ఉడికించాలి. అంచులకు అంటే దాకా ఉంచి,అందులో కోకోపొడివేసి బాగా కలపాలి. మిశ్రమం మృదువుగా అయ్యేదాకా ఉంచాలి.
అంచువున్న పళ్ళెంలో ఈ మిశ్రమాన్ని సమానంగా పరచి పిస్తాపప్పులు వేసి కొద్దిగా వాటిపైన నొక్కాలి. గోరు వెచ్చగా ఉన్నపుడు
కట్ చేసుకోవాలి.