header

Gulab jammoon / గులాబ్ జామూన్

Gulab jammoon / గులాబ్ జామూన్
కావాలిసిన పదార్ధాలు

పాలపొడి – ఒక కప్పు
మైదా – పావు కప్పు
గోధుమపిండి – పావుకప్పు
వెన్న – మూడు టేబుల్ స్పూన్లు
పాలు – పావుకప్పు
చక్కెర – రెండు కప్పులు
నీళ్లు – ఒకటిన్నర కప్పు
యాలకులు– నాలుగు (పొడి చేయాలి), బాదం పప్పులు – పది (సన్నగా పొడవుగా తరగాలి)
నెయ్యి – వేయించడానికి సరిపడినంత
తయారు చేసే విధానం
ఒక పాత్రలో పాల పొడి, మైదా, గోధుమ పిండి వేసి సమంగా కలిపిన తర్వాత వెన్న వేసి మళ్లీ కలపాలి. దీంట్లో పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మిశ్రమంలోఎక్కడా పిండి ఉండలు లేకుండా అంతా సమంగా మృదువుగా ఉండేటట్లు కలుపుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈ టైమ్లో పాల పొడి, పాలతో కలుస్తుంది. ఈలోపుగా పాకం సిద్ధం చేసుకోవాలి. చక్కెర పాకం తయారీ
∙వెడల్పుగా ఉన్న పాత్రలో చక్కెర, నీళ్లు పోసి మరిగించాలి. చక్కెర కరిగి, రెండు వేళ్లతో తాకి చూసినప్పుడు పాకం అతుక్కుంటున్న దశలో యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి ∙
బాణలిలో నెయ్యి వేసి అది వేడయ్యే లోపుగా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను కాగిన నేయ్యిలో సన్నని మంట మీద ముదురు గోధుమరంగు వచ్చే వరకు వేయించి తీయాలి. సిద్ధంగా ఉంచిన వేడి వేడి పాకంలో ఉండలను వేసి పైన మూత పెట్టాలి. తర్వాత సర్వ్ చేయాలి.
గమనిక: గులాబ్ జామూన్లు వేగేటప్పుడు, పాకం పీల్చుకునేటప్పుడు వాటి పరిమాణం పెరుగుతాయి. కాబట్టి నేయ్యిలో వేయించేటప్పుడు ఒక్కసారిగా ఎక్కువ వేయకుండా తీసుకున్న నేతిపరిమాణాన్ని బట్టి కొన్ని వేసి తీశాక మరికొన్ని వేసి వేయించాలి.