మైదా: అరకిలో
సెనగపిండి: 2 టేబుల్‌స్పూన్లు
సోడాబైకార్బొనేట్: చిటికెడు
పంచదార: అరకిలో
నెయ్యి: తగినంత
పంచదారపొడి: చల్లడానికి సరిపడా
మైదాను జల్లించి అందులో సెనగపిండి, సోడా వేసి కలపాలి. తరవాత రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి పిండిని మృదువుగా కలపాలి. పిండిమీద పలుచని తడిబట్టను కప్పి ఓ రెండు గంటల సేపు నాననివ్వాలి. అదేసమయంలో మరో గిన్నెలో పంచదార, అది మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించి తీగపాకం రానివ్వాలి. పిండి ముద్దను అంగుళం మందంలో తాడులా పొడవుగా చేయాలి. దీన్ని చాకుతో అంగుళం వెడల్పు ఉండేలా ముక్కలుగా కోయాలి.
ఓ ప్లేటులో పిండి వేసి అందులో ఈ ముక్కలు వేసి ఉంచాలి. ఒక్కో ముక్కనీ తీసుకుని రెండు అంగుళాల పొడవు వచ్చేలా అప్పడాల కర్రతో వత్తాలి. ఇలాగే అన్నీ చేసి, కాగిన నెయ్యిలో వేసి వేయించాలి. వేగిన వెంటనే మరిగించిన పాకంలో వేసి మునిగేలా చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాలు నానాక బయటకు తీసి పంచదార పొడి చల్లి ఆరనివ్వాలి.