కావలిసిన పదార్ధాలు
పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు,
కోవా : రెండుకప్పులు
పాలు: 1 టీస్పూన్
పంచదార : అరకప్పు
ఏలకుల పొడి : పావు టీ స్పూన్
తయారు చేసే విధానం :
చిన్న బౌల్ తీసుకుని అందులో టీస్పూన్ పాలు పోసి కుంకుమపువ్వు కలిపి పక్కన ఉంచుకోవాలి. తరువాత వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ లో కోవా వేడిచేసి, మధ్యస్ధంగా ఉండే సెగపై ఎడెనిమిది నిమిషాలు ఉడికించాలి. పంచదార కూడా కలిపి ఒకటి, రెండు నిమిషాలు కలయబెడుతూ ఉడికించాలి.
ప్లేట్ లోకి మిశ్రమాన్ని మార్చుకుని సమంగాపరచి, మూతపెట్టి ఒక గంట పక్కనుంచుకోవాలి.
కోవా మిశ్రమాన్ని కలియబెట్టి యాలకులపొడి, కుంకుమపువ్వు, పాలు కలపాలి. మిశ్రమాన్ని 16 సమభాగాలుగాల చేసుకుని గుండ్రంగా చేసుకుని మధ్యలో ఫ్లాట్ గా నొక్కాలి. దీనిని ఎయిర్ కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్ లో బధ్రపరచుకోవాలి