మైదా: కప్పు
పాలు: ఒకటిన్నర కప్పులు
కోవా: అరకప్పు
ఉప్పు: చిటికెడు
సోంపు: టీస్పూను
బేకింగ్ పౌడర్: చిటికెడు
నెయ్యి: వేయించడానికి సరిపడా
పంచదార పాకం కోసం: మంచినీళ్లు పావుకప్పు
పంచదార: కప్పు
యాలకులపొడి: చిటికెడు
కుంకుమపువ్వు: చిటికెడు
ఓ గిన్నెలో పంచదార, మంచినీళ్లు పోసి మరిగించి లేతపాకం వచ్చాక కుంకుమపువ్వు, యాలకులపొడి వేసి కలిపి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో సగం పాలు గోరువెచ్చగా చేసి తీసి మరో గిన్నెలో పోయాలి. అందులోనే కోవా, మైదా వేసి కలపాలి. తరవాత పంచదార, ఉప్పు, సోంపు, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. ఇప్పుడు మిగిలిన పాలు కూడా పోసి కలపాలి. పిండి మృదువుగా అవుతుంది. దీన్ని పక్కన ఉంచి బాణలిలో నెయ్యి పోసి కాగాక, పిండి మిశ్రమాన్ని చిన్నపాటి పూరీలా చేసి, వేసి సిమ్‌లో వేయించి తీయాలి. ఇప్పుడు వీటిని పంచదార పాకంలో ముంచి తీసి, రబ్డీ వేసి అందిస్తే సరి. దీన్నే మలైపూరీ అనీ అంటారు