పాలు, డికాషన్ మరిగేటప్పుడు కొద్దిగా దాల్చిన చెక్కను మొత్తగా పొడిగా నూరుకొని డికాషన్ లో వేసి బాగా మరగనివ్వాలి.
శరీరంలో పేరుకున్న కొవ్వుని తగ్గించుకోవడానికే కాదు... ఏకాగ్రతను పెంచడంలోనూ దాల్చిన చెక్క బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందట. అందుకే దాంతో చాయ్ చేసుకున
అప్పుడప్పుడూ తాగవచ్చు
దాల్చిన చెక్కలో సాధారణ యాంటీఆక్సిడెంట్లతో పోలిస్తే పాలీఫినాల్ అనే శక్తిమంతమైన పోషకం ఉంటుంది. అందుకే దీనిని సూపర్‌ఫుడ్ అంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ తక్కువ కాకుండా క్రమబద్ధీకరిస్తుంది. పరీక్షల సమయంలో, పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం తాగే చాయ్‌లో కొద్దిగా దాల్చినచెక్క పొడి వేసుకుంటే మంచిది. ఇది మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది.
కొవ్వు సమస్య ఉన్నవారు దాల్చిన చెక్క టీని రోజూ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరాన్ని ఇబ్బందిపెట్టే వాపూ, మంటా, అలెర్జీతో పాటూ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందీ చాయ్. దాల్చిన చెక్కని పొడి కొట్టుకుని పెట్టుకుంటే ఆరునెలలు ఉంటుంది. చెక్క రూపంలోనే ఉంచితే ఏడాది పాటు దాని సుగుణాలు పదిలంగా ఉంటాయి. దీన్ని అచ్చంగా చాయ్‌లా చేసుకోవచ్చు లేదా మామూలు టీలోనూ కొద్దిగా కలుపుకోవచ్చు.
గుండె ఆరోగ్యానికి ఈ చాయ్ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.