కావాల్సినవి
మంచినీళ్లు: 3 కప్పులు
పాలు: 4 కప్పులు
టీపొడి: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
పంచదార: 3 టేబుల్‌స్పూన్లు
కోవా: 3 టేబుల్‌స్పూన్లు
యాలకులు: మూడు
అల్లంతురుము: టేబుల్‌స్పూను
టీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాక దంచిన యాలకులు, అల్లంతురుము వేసి ఆ నీళ్లు సగమయ్యేవరకూ మరిగించాలి. తరవాత టీపొడి, పంచదార వేసి మూతపెట్టి సిమ్‌లో మరిగించాలి. సుమారు పది నిమిషాలకు ఆ నీళ్లు సగమవుతాయి. అదేసమయంలో మరో పాత్రలో పాలు పోసి కాచాలి. అవి మరగడం మొదలవగానే సిమ్‌లో పెట్టి మూడింట రెండొంతులు అయ్యేవరకూ కాచాలి. ఇప్పుడు పాలల్లో కోవా కూడా వేసి పూర్తిగా కలిసేవరకూ కలిపి ఓ నిమిషం మరిగించి దించాలి.
ఇప్పుడు కప్పులో ఒక వంతు టీ డికాక్షన్ పోసి నాలుగు వంతుల పాల మిశ్రమం వేసి స్పూనుతో తిప్పి అందించాలి.