header

గ్రీన్‌ టీ / Green Tea

గ్రీన్‌ టీ / Green Tea

తయారు చేసే విధానం

నీళ్ళు బాగా మరగపెట్టి దించుకొని ఈ నీళ్లలో గ్రీన్ టీ ఆకులు కొద్దిగా వేసి మూతపెట్టి 3 నిమిషాల సేపు ఉంచాలి. తరువాత వడపోసుకొని త్రాగవచ్చు. మంచి ఫలితాలకోసం గ్రీన్ టీలో పాలు గానీ, పంచదార గానీ కలుపకూడదు. 2,3 చుక్కల నిమ్మరసం పిండుకోవచ్చు.
గ్రీన్‌ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పలు రకాలైన క్యాన్సర్‌లనుండి కాపాడడంలో తోడ్పడతాయి. రోజూ గ్రీన్‌ టీని తాగడం వల్ల గుండె జబ్బులనుండి మనల్ని కాపాడుతుంది. శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ పెరుగుదలను నిరోధిస్తుంది. గుండె సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. గ్రీన్‌టీలో తక్కువ కెలోరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలోని కొలెస్టరాల్‌ను కరిగించడంలో గ్రీన్‌టీ చక్కగా తోడ్పడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం జరుగుతుంది. వయసు పెరుగుదల ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావాన్ని గ్రీన్‌టీ తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది.