కావాల్సినవి
చిక్కని పాలు(హోల్‌మిల్క్): 4 కప్పులు
కోవా: 4 టేబుల్‌స్పూన్లు
పంచదార: 2 టీస్పూన్లు
టీపొడి: 2 టేబుల్‌స్పూన్లు
మంచినీళ్లు:3 కప్పులు
గిన్నెలో టీ పొడి వేసి నీళ్లు పోసి మూతపెట్టి సుమారు అరగంటసేపు మరిగించాలి. అది వడబోస్తే సుమారు అరకప్పు అవుతుంది. మరో గిన్నెలో పాలు పోసి సుమారు ఒకటిన్నర కప్పులు అయ్యేవరకూ మరిగించాలి. తరవాత కోవా, పంచదార వేసి కరిగేవరకూ వేగంగా కలపాలి. ఇప్పుడు ఇందులో వడబోసిన డికాక్షన్ వేసి కలిపితే హైదరాబాదీ ఇరానీ చాయ్ రెడీ.