కావాల్సినవి
అల్లం పేస్ట్ : అరస్పూను
చెక్క, లవంగాలు, యాలకులు : ఒక స్పూను
నిమ్మరసం : అరస్పూన్
టీ పొడి : రెండు స్పూన్లు
తులసి, పొదినా ఆకులు : పది
తేనె లేక పంచదార : ఒక స్పూను
తయారు చేసే విధానం :
రెండు గ్లాసుల నీరు తీసుకుని మరగబెట్టి నిమ్మరసం తప్ప మిగతా వాటిని వేసి బాగా మరిగించాలి. మంచి సువాసన వచ్చేవరకు మరగబెట్టాలి. తరువాత కొద్దిగా చల్లారనిచ్చి నిమ్మరసం, తేనె లేక పంచదార కలిపి తాగవచ్చు.
ఈ మసాలా టీ తాగటం వలన జలుబు, దగ్గునుండి ఉపశమనం కలుగుతుంది. పాలు లేకుండా తాగడం వలన కొవ్వు సమస్య ఉండదు. ఉదయం, సాయంత్రం తాగితే తక్షణం శక్తి వస్తుంది.