

కావాల్సినవి
చిక్కని పాలు: 2 కప్పులు 
 మంచినీళ్లు: 2 కప్పులు 
 సోంపు: పావుటీస్పూను 
 మిరియాలు: నాలుగు 
 యాలకులపొడి: అరటీస్పూను 
 అల్లంతురుము: అరటీస్పూను 
 పంచదార: మూడున్నర టీస్పూన్లు 
 దాల్చినచెక్క: ఒకటిన్నర అంగుళంముక్క 
బ్లాక్ టీ: 5 టీస్పూన్లు  
దాల్చినచెక్క, యాలకులపొడి, మిరియాలు, సోంపు అన్నీ కలిపి బాగా దంచాలి.  
గిన్నెలో పాలు పోసి మూడింట రెండొంతులు అయ్యేవరకూ మరిగించాలి. తరవాత పంచదార, మసాలాపొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి సిమ్‌లో మూడు నిమిషాలు మరిగించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి సగమయ్యేవరకూ మరిగించాక టీ ఆకు వేసి మరో నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్‌చేసి మూతపెట్టి ఉంచాలి. సుమారు ఐదు నిమిషాల తరవాత డికాక్షన్‌ను వడబోసి మరిగే పాలల్లో పోసి సిమ్‌లో నిమిషం మరిగించి అందించాలి.