గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ.. ఇలా రకరకాల టీలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఈసారి తులసి చాయ్ కూడా తాగి చూడండి. దానివల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంటుంది.
..తులసి ఆకుల్ని ఉడికించి నిమ్మరసం మాత్రమే చేర్చి తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో ఉండే పాలీశాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయి.
..తులసి టీ తాగడం వల్ల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అంది.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలూ దూరమవుతాయి. చర్మ కణాలను పునరుద్ధరించే శక్తి ఈ టీ సొంతం.
..తరచూ జలుబుతో బాధపడేవారు రోజుకు రెండు కప్పులు ఈ టీ తాగాలి. దీనిలోని పోషకాలు జలుబుతోపాటూ ఇతర ఇన్‌ఫెక్షన్లూ దూరం చేస్తాయి.
..ఈ టీలో లభించే బీటాకెరొటిన్లు గుండెకు మేలు చేస్తాయి. గుండెకు రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదం చేస్తాయివి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందీ టీ.